తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2021, 11:50 AM IST

ETV Bharat / state

అతని ఆలోచనే వారిని ఆస్పత్రులకు చేర్చుతోంది

రవాణా సదుపాయం లేక కొవిడ్​ బాధితులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సొంత వాహనం ఉంటే ఆస్పత్రులకు వెళ్లగలుగుతున్నారు. అందరికీ అంబులెన్స్​ సౌకర్యం వీలుకావడం లేదు. చాలామంది సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేక ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ దుస్థితి చూసి చలించిపోయిన ఓ వ్యక్తి తనవంతు సాయం చేశాడు. కొవిడ్​ బాధితులు ఆస్పత్రులు వెళ్లేందుకు రవాణా సదుపాయం కల్పించాడు.

తెలంగాణ వార్తలు
నిజామాబాద్​ వార్తలు

కరోనా లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరు ముందుకు రాని రోజులివి. అంబులెన్స్ సౌకర్యం మినహాయిస్తే, సొంత వాహనాలు ఉన్నవారు వెళ్తున్నారు. సకాలంలో వైద్యం అందక ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ పరిస్థితులు చూసిన నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్​పేట్​కు చెందిన అప్పల గణేశ్​ చలించిపోయారు. కొవిడ్ పరీక్షలు చేయించుకోడానికి వెళ్లేవారికి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్తున్నవారికి రవాణా సదుపాయం కల్పిస్తున్నాడు.

తన ఆటో రిక్షా ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నారు. ఇంగురోలం అదే గ్రామానికి చెందిన ముజీబ్ డ్రైవర్ గా పనిచేసేందుకు ముందుకొచ్చాడు. రవాణా ఖర్చులు, డ్రైవర్​కు వేతనం ఇస్తూ రోగులకు సాయం అందిస్తున్నాడు గణేశ్​. ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసేందుకు ముందుకొచ్చిన ముజీబ్​కు బీమా సౌకర్యం కల్పించారు. డ్రైవర్​కు క్యాబిన్ ఏర్పాటు చేయించారు. ఐదు రోజుల్లోనే 12 మందికి పైగా రోగులను ఆర్మూర్, నిజామాబాద్ ఆస్పత్రులకు చేర వేసినట్లు చెప్పారు. ఓ మహిళను సకాలంలో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా ఆమె ప్రాణాలు కాపాడామని వివరించారు.

ఇదీ చూడండి:వైరస్ భయం..కుటుంబంతో సహా పొలానికి మకాం

ABOUT THE AUTHOR

...view details