నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో బ్లాక్ ఫంగస్ కలకలం రేగింది. ఎల్కే ఫారానికి చెందిన హరి బాబు(36) బ్లాక్ ఫంగస్ బారినపడి మరణించాడు. మృతుడికి వారం రోజుల క్రితం కరోనా సోకగా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.
బ్లాక్ ఫంగస్‌తో నవీపేట వాసి మృతి - బ్లాక్ ఫంగస్ లేటెస్ట్ వార్తలు
రాష్ట్రంలో ఓ వైపు కరోనా కబళిస్తుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా బ్లాక్ ఫంగస్‌తో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మృతి చెందటంతో కలకలం రేగింది.
బ్లాక్ ఫంగస్
అక్కడ రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత పరిస్థితి ఇంకా విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. మృతునికి భార్య, ఐదేళ్ల కొడుకు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్‌తో మరో మరణం