నిజామాబాద్ నగరంలోని దుబ్బ వైకుంఠధామానికి.. ధన్ పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శవపేటిక (ఫ్రీజర్)ను అందజేశారు. అత్యవసర సమయంలో నగర ప్రజలకు సేవలందించడానికి తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుదన్నారు ట్రస్ట్ ఛైర్మన్ సూర్య నారాయణ.
దుబ్బ వైకుంఠధామానికి ఉచిత శవపేటిక - నిజామాబాద్ కొవిడ్ న్యూస్
నిజామాబాద్ నగరంలోని దుబ్బ వైకుంఠధామానికి.. ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ శవపేటికను ఉచితంగా అందజేసింది. కరోనా రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సంస్థ ఛైర్మన్ సూచించారు.
![దుబ్బ వైకుంఠధామానికి ఉచిత శవపేటిక donation of a coffin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:01:23:1620271883-tg-nzb-14-05-sheva-petika-andhajetha-av-ts10123-05052021193317-0505f-1620223397-901.jpg)
donation of a coffin
కరోనా రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నగర ప్రధాన కార్యదర్శి కృష్ణ, కార్పొరేటర్లు శంకర్, వినోద్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.