తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిజామాబాద్ పేరును ప్రపంచానికి చాటిచెప్పినందుకు చాలా గర్వంగా ఉంది' - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు

NIKHAT ZAREEN: ప్రపంచ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్​కు తన సొంత జిల్లా నిజామాబాద్​కు తొలిసారిగా వచ్చిన తరుణంలో ఘన స్వాగతం లభించింది. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతరనేతలు, అధికారులు, అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు.

నిఖత్ జరీన్
నిఖత్ జరీన్

By

Published : Jun 16, 2022, 7:08 PM IST

NIKHAT ZAREEN: ప్రపంచ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్​కు నిజామాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఆమె రాకను పురస్కరించుకొని పులాంగ్ చౌరస్తా నుంచి న్యూ అంబేడ్కర్​ భవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యూ అంబేడ్కర్ భవన్​లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ పాల్గొన్నారు. నిఖత్ జరీన్​ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా, చెరో లక్ష రూపాయల చొప్పున బహుమానం అందచేశారు. ఎమ్మెల్యే షకీల్ బోధన్ పట్టణం కేంద్రంలో 200 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా ఎదగడం అసాధ్యమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పట్టుదల ఏకాగ్రత ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాను ప్రపంచ స్థాయిలో నిలిపినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

నిజామాబాద్ పేరును ప్రపంచానికి చాటిచెప్పినందుకు చాలా గర్వంగా ఉందని నిఖత్ జరీన్ అన్నారు. ఇక్కడ బాక్సింగ్ ఓనమాలు నేర్చుకొని ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​గా తిరిగి రావడం చాలా గర్వకారణంగా ఉందని వెల్లడించారు. ప్రధాని మోదీ నోట నిజామాబాద్​ అని రావడం తనకు పట్టరాని సంతోషం కలిగిందని పేర్కొన్నారు. మనం ఓ లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం సాధిస్తే అందులోని ఆనందాన్ని వర్ణించలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ పేరును ప్రపంచానికి చాటిచెప్పినందుకు చాలా గర్వంగా ఉంది

ఇదీ చదవండి:Sadguru on green india challenge: 'తెలంగాణ బిగ్ గ్రీన్‌స్పాట్‌గా మారింది'

బొట్టు బిళ్లలతో 100 అడుగుల పెయింటింగ్.. మోదీ కోసం..

ABOUT THE AUTHOR

...view details