నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి బాలికను అపహరించి తీసుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. పెర్కిట్‌కు చెందిన నజ్మా... మహారాష్ట్రలోని జాల్నా ప్రాంతం నుంచి వచ్చి ఉంటున్న రహీమ్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. నగదు వసూలు కోసం నిందితుడు... నజ్మా మూడేళ్ల కుమార్తెను అపహరించేందుకు పథకం వేశాడు.
డబ్బు వసూలు కోసం బాలిక అపహరణ... 12గంటల్లోనే రక్షించిన పోలీసులు... - three years girl kidnapped for money recovery in nizamadad
డబ్బుల వసూలు కోసం ఓ వ్యక్తి మూడేళ్ల బాలికను అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని మదర్సా వద్ద గత నెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శుక్రవారం పెర్కిట్‌లోని మదర్సా వద్ద నుంచి బాలికను ఎత్తుకెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ చిత్రాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేశారు. బాలికను తీసుకుని నిందితుడు మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించి.... అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి సహకారంతో బాలికను పట్టుకున్నారు. అపహరించిన 12 గంటల్లోపే కేసు ఛేదించారు. నిందితుడు రహీమ్ పరారీలో ఉన్నాడని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన ఆటో.. 11 మందికి తీవ్రగాయాలు