నిజామాబాద్ జిల్లాలో పౌర హక్కుల సంఘం నేత తన తండ్రి మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు దానం చేశారు. వైద్య విద్యార్థుల ప్రయోగాలు చేసుకునేందుకు వీలుగా మృతదేహాన్ని అప్పగించారు. జక్రాన్‌పల్లి మండలం పుప్పాలపల్లికి చెందిన పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రవీందర్ తండ్రి లింగయ్య అనారోగ్యంతో మరణించారు. తన తండ్రి మృతదేహం సమాజానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన పార్థివ దేహాన్ని నిజామాబాద్ వైద్య కళాశాలకు దానం చేశారు.
వైద్య కళాశాలకు మృతదేహం దానం.. - dead body donation to medical college
వైద్య కళాశాలకు తన తండ్రి మృతదేహాన్ని దానం చేసి సమాజం పట్ల బాధ్యతను చాటుకున్నారు పౌర హక్కుల సంఘం నేత. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది.
వైద్య కళాశాలకు మృతదేహం అప్పగింత, నిజామాబాద్
ఈ మేరకు నగరంలోని కోటగల్లీ ఎన్ఆర్భవన్కు లింగయ్య మృతదేహాన్ని తరలించి అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచారు. వామపక్ష నేతలు, పౌర హక్కుల సంఘం నాయకులు నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో వైద్య కళాశాలకు తరలించారు.