A Boy In nizambad died in Accident : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాల గాయాలపాలై చికిత్స పొందుతున్న బాలుడు దీపక్తేజ్ మృతి చెందాడు. పరిస్థితి విషమించడంతో వైద్యులు దీపక్‌ను హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. తీసుకెళ్లె క్రమంలో మార్గ మద్యంలోనే దీపక్ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంకాలం ఎమ్మెల్యే అనుచరులు ప్రయాణిస్తున్న కారు బోధన్ పట్టణంలోని మర్రి మైసమ్మ దగ్గర్లోని రాయల్గార్డెన్ సమీపంలో అజయ్ అలియాస్ దీపక్ అనే బాలుడిని ఢీకొట్టింది.
ఒక్కసారిగా బాలుడు ఎగిరి పడడంచే అతడికి తీవ్ర గాయలయ్యాయి. కళ్లముందు కుమారుడు అలా అయ్యేసరికి అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే దీపక్‌ను నిజమాబాద్ ఆస్పత్రికి తరలించారు. మెదడుకు తీవ్రగాయాలు కావడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే దీపక్ పరిస్థితి క్లిష్టంగా మారింది. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని అనుకున్నారు. ఆసుపత్రికి తరలించే తరుణంలో మార్గం మధ్యలోనే దీపక్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిదని బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితునిపై వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.