A 13 Year Old Girl Married 42Year Old Man in Nizamabad : ఆ అమ్మాయికి అమ్మ లేకపోవడమే శాపంగా మారింది. మంచిచెడుల్లో తోడుండాల్సిన తల్లి చనిపోవడంతో మద్యానికి బానిసైన తండ్రి నీడలో పెరుగుతోంది. దానికి తోడు పేదరికం ఆమె పెళ్లికి మరో కారణమైంది. ఎదురు కట్నం వస్తుందని ఆశించిన ఆ తండ్రి తన కన్న కూతురుకంటే మూడింతలు వయస్సున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేయడానికి సిద్దమయ్యాడు. సరైన సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు, అధికారులు ఈ చిన్నారి జీవితాన్ని కాపాడారు.
భారతదేశంలో మహిళాభివృద్ధి రోజురోజుకు ఎంతో పెరుగుతుందో దాంతో పాటు అన్ని అత్యాచారాలు, బాల్య వివాహాలు, హత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వం బాల్య వివాహాలు అరికట్టడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. 18ఏళ్లు నిండితేనే అమ్మాయికి పెళ్లి చేయాలని కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు తీసుకొచ్చినా బీదరికం వాళ్లని బాల్య వివాహాలని వదలకుండా చేస్తోంది. ఈ రోజుల్లో కూడా అభం శుభం తెలియని చిన్నారులను సంసార సాగరంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిలేని బిడ్డ అని 13ఏళ్ల బాలికను 42 సంవత్సరాల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు.