నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రానికి చెందిన అంజి అనే బాలుడు వెల్మల్‌లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. తన మేనమామ సతీష్‌తో కలిసి ఈతకు వెళ్లారు. ఇద్దరూ చెరువులో దిగి స్నానం చేస్తుండగా... దురదృష్టవశాత్తు అంజి నీటిలోనే మునిగిపోయాడు.
ఈతకు వెళ్లి చెరువులో పడి పదేళ్ల బాలుడి మృతి - ఈతకు వెళ్లి పదేళ్ల బాలుడి మృతి
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గంగి చెరువులో మేనమామతో కలిసి స్నానానికి వెళ్లిన పదేళ్ల బాలుడు గురువారం ఈత రాక నీటిలో మునిగిపోయాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీశారు.
ఈతకు వెళ్లి చెరువులో పడి పదేళ్ల బాలుడి మృతి
సతీష్ అంజిని కాపాడేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ... విఫలమయ్యాడు. అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహం కోసం గాలించగా... ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమయింది. అంజి మృతితో గ్రామస్థులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌లోనూ ఆయువు తీసే వాయువులెన్నో?