నిజామాబాద్‌లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి గోదారమ్మ ఉరకలెత్తుతోంది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా మారింది. 40 గేట్ల ద్వారా... లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో... జలాశయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోందని నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడించారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద - శ్రీరామ్ సాగర్‌కు వరద
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. 40 గేట్ల ద్వారా లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద