మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని నిజామాబాద్ అదనపు కమిషనర్ అరవింద్ బాబు సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులతో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నిజామాబాద్లో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
'రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి' - road safety month celebrations in nizamabad
ప్రమాదాల నివారణకు వాహనదారులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ అదనపు కమిషనర్ అరవింద్ బాబు అన్నారు. 32వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి
వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్డ్ ధరించి నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని అరవింద్ అన్నారు. రోడ్డు భద్రత నిత్య జీవితంలో భాగం కావాలని చెప్పారు. సమాజ భద్రత, కుటుంబ భద్రత మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి :'50 శాతం మంది జీవన ప్రమాణాల్లో క్షీణత'