తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరంతా కదిలారు... వీధులన్నీ ఊడ్చారు...! - శ్రమదానం

ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు గ్రామస్థులు ఏకమవుతున్నారు. వీధులన్నీ శుభ్రం చేస్తూ... స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేసుకుంటున్నారు. నిజామాబాద్​ జిల్లాలోని రెంజర్లలో స్థానికులంతా చీపుర్లు పట్టి... ఊరంతా శుభ్రం చేశారు.

30 days action plan done at renjarla village

By

Published : Sep 14, 2019, 7:06 PM IST

Updated : Sep 14, 2019, 7:13 PM IST

నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్లలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు శ్రమదానం చేశారు. ఎంపీపీ పద్మతో పాటు సర్పంచ్​ రాజిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీధుల్లో ఊడ్చి చెత్తను తొలగించారు. రహదారుల పక్కన పేరుకుపోయి ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. స్వచ్ఛ రెంజర్లగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. వీధుల్లో ఎవరు చెత్తను వేయవద్దని స్థానికులకు వివరించారు.

ఊరంతా కదిలారు... వీధులన్నీ ఊడ్చారు...!
Last Updated : Sep 14, 2019, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details