Sriram Sagar 28 gates lifted: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు రాష్ట్రంలో జలశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీనికి తోడు ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహం కారణంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి లక్షా 37 వేల 850 క్యూసెక్కుల నీరు వచ్చినట్లు ప్రాజెక్టు నిర్వహణ అధికారులు తెలిపారు. దీంతో ముందుస్తు జాగ్రత్తలో భాగంగా 28 గేట్ల నుంచి లక్షా 49 వేల 760 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.. 28 గేట్లు ఎత్తి నీటి విడుదల - తెలంగాణలో భారీ వర్షాలు
Sriram Sagar 28 gates lifted: రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జలశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తోన్న వరద కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో జలకళ ఉట్టిపడుతోంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా 28 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Sri Ram Sagar project
ప్రాజెక్టులో 1091 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గానూ.. 1090.9 అడుగుల మేర నీరు ఉండగా కాకతీయ కాలువ ద్వారా 5,500 ఎస్కేప్ గేట్ల నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 89.763 టీఎంసీల నీరు నిలువ ఉందని అధికారులు వివరించారు.
ఇవీ చదవండి: