ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద జాతీయ పతాకం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చూపరులను ఆకట్టుకుంది. జర్నలిస్టు కాలనీకి వెళ్లే మార్గంలో వంద అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు గల మువ్వన్నెల జెండాను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. భారీ జాతీయ జెండా ఆవిష్కరణలో వేలాది మంది పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం నింగిలో రెపరెపలాడగానే జాతీయ గీతం ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా 13.50 లక్షల వ్యయంతో ఈ జెండాను పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. 45 లక్షల ఖర్చుతో క్లాక్ టవర్ను నిర్మించారు. పక్కనే చిన్నపాటి జలపాతం ఏర్పాటు చేశారు.
100 అడుగుల మువ్వన్నెల జెండా - జాతీయ పతాకం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో 100 అడుగుల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద జాతీయ పతాకంగా నిలిచింది.
100 అడుగుల మువ్వన్నెల జెండా
ఇవీ చూడండి: రెండు పడక గదుల ఇళ్ల ఆక్రమణదారుల తరలింపు
Last Updated : Jun 26, 2019, 5:59 PM IST