నిర్మల్ జిల్లా ముథోలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 1997 - 98 సంవత్సరంలో పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువులు చదివి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కానీ సొంతూరిపై మమకారంతో.. కరోనా కష్టకాలంలో సొంతూరి ప్రజలకి తమ వంతు సాయం చేయాలనుకున్నారు. మిత్రులందరూ ఏకమై ఊర్లోని 100 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు, కొన్ని రకాల కూరగాయలను అందించి సేవ దృక్పతాన్ని చాటుకున్నారు.
సొంతూరికి అండగా.. మిత్రులు ఉండగా.. - సొంతూరి ప్రజలకు ముథోల్ యువత చేయూత
లాక్డౌన్ కొనసాగుతున్న వేళ సొంతూరి ప్రజలకు అండగా తమ వంతు సాయం చేయడాని ఓ మిత్రబృందం సభ్యులు ముందుకొచ్చారు. నిర్మల్ ముథోలోని 100 మంది నిరుపేద కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.

సొంతూరికి అండగా.. మిత్రులు ఉండగా..
భైంసా డీఎస్పీ నర్సింగరావు, తహసీల్దార్ లోకేశ్వర్‌రావు, సీఐ అజయ్ బాబు చేతుల మీదుగా వాటిని వితరణ చేశారు. మాకేమి పట్టిందిలే అనుకోకుండా సొంతఊరికి తమ వంతు సాయం చేయాలనుకుని ముందుకొచ్చిన ఆ మిత్ర బృందాన్ని డీఎస్పీ అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా వారు కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన సూచించారు.