కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగించడం వల్ల వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిర్మల్ జిల్లా సోన్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు అన్నారు. వారికి కూరగాయలు పంపిణీ చేసిన శ్రీ ధర్మశాస్త యూత్ సేవలు మరవలేనివని కొనియాడారు.
'శ్రీ ధర్మశాస్త యూత్ సేవలు మరవలేనివి' - vegetables distribution in sone in nirmal
నిర్మల్ జిల్లాకు చెందిన శ్రీ ధర్మశాస్త యూత్ సేవలు మరవలేనివని సోన్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొత్తగొల్ల నరేష్ అన్నారు. మండలంలోని కడ్తాల్ గ్రామంలో శ్రీ ధర్మశాస్త యూత్ అధ్వర్యంలో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.

పేదలకు కూరగాయల పంపిణీ
ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త యూత్ సభ్యులు మణికంఠ, రమేశ్, ప్రశాంత్, సందీప్.. గ్రామస్థులు గుర్రం నారాయణ, గుర్రం రాము, గుర్రం భీమన్న, మేకల అశోక్, బర్మ రమణ, చింతల ప్రవీణ్, బొజ్జ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.