తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య - Young Boy Suicide in Nirmal District

నిర్మల్ జిల్లా భైంసాలో తండ్రి మందలించడని 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడని తెలిసి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు.

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

By

Published : May 8, 2019, 5:58 PM IST

నిర్మల్ జిల్లా భైంసాలో తండ్రి మందలించాడని డిగ్రీ విద్యార్థి గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తనూర్ మండలం బెల్ తారోడా గ్రామానికి చెందిన సతీష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొద్ది రోజుల నుంచి కాళశాలకు వెళ్లకపోవడం వల్ల తండ్రి మందలించటంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం షాప్​కు వెళ్లివస్తానని చెప్పి తిరిగిరాలేదు. తన కొడుకు తిరిగి రాలేదని తండ్రి ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం గడ్డేన్న వాగు ప్రాజెక్టు లో శవమై తెలాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details