నిర్మల్ జిల్లా భైంసా మండలం మహగాం గ్రామంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అప్పటివరకు ఎండవేడిమితో ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి.. బలమైన ఈదురుగాలులు వీచాయి. గాలులకు వర్షం తోడవడం వల్ల కొద్దిసేపు జనజీవనం స్తంభించింది. ఈదురు గాలుల వేగానికి పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల చెట్లు విరిగి ఇళ్లపై పడ్డాయి. పశువుల పాకలు, పూరిళ్ల పైకప్పులు లేచిపోయాయి. ధాన్యం సైతం నీటిపాలయింది.
భైంసాలో ఈదురుగాలుల బీభత్సం - భైంసాలో ఈదురుగాలుల బీభత్సం
నిర్మల్ జిల్లా భైంసాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలుల వేగానికి పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
భైంసాలో ఈదురుగాలుల భీభత్సం