నిర్మల్ జిల్లాలోని రైతులు యాసంగిలో అత్యధికంగా వరి సాగు చేస్తారు. సాగుకు అవకాశమున్నా.. వ్యవసాయ కూలీల సమస్య వేధించింది. రోజురోజుకు కూలీలు తగ్గిన పరిస్థితుల మధ్య రైతులు ఇతర జిల్లాలపై ఆధారపడేవారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురికి ఉపాధిగా మారింది. ఇక్కడి నుంచి ఏటా దాదాపు 70 మంది కూలీలు వలసలు వచ్చేవారు. యాసంగి పనులు ప్రారంభం నాటికి వీరంతా వరి నాట్లు వేయడంలో బిజీగా మారుతున్నారు. పిల్లల చదువు, జీవనం కొనసాగాలంటే వలస కూలీకి వెళ్ళక తప్పట్లేదని వాపోయారు.ఏటా నల్గొండ జిల్లా నుంచి రైతు కూలీలు వస్తుంటారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ అలుపు లేకుండా నాట్లు వేయడంతో తమకు ఖర్చు తగ్గి, సమయం కలసి వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
రోజు వారి కూలీ రూపంలో కాకుండా ఎకరానికి 3500 చొప్పున తీసుకుంటారు. ప్రతిరోజూ 20 ఎకరాల వరకు నాట్లు వేయడంతో రైతులకు గిట్టుబాటు లభిస్తోంది. అటు కూలీలకూ చేతి నిండా పని దొరుకుతోంది.