White buffalo calf born: సాధారణంగా గేదెలు నలుపు రంగులో ఉంటాయి. వాటికి పుట్టే దూడలు సైతం అదే రంగులో ఉంటాయి. కానీ నిర్మల్ జిల్లాలో ఓ గేదెకు తెల్లటి దూడ జన్మించటం... అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. కుభీర్ మండలంలోని 'పార్డి-కె' గ్రామానికి చెందిన శాహేన్‌రెడ్డి అనే రైతుకు చెందిన గేదె మూడ్రోజుల క్రితం దూడకు జన్మనిచ్చింది.
ఆరు సంవత్సరాల క్రితం ఈ గేదెను కొన్నాం. రెండు సార్లు దీనికి నలుపు రంగులో దూడలు జన్మించాయి. కానీ ఈ సారి తెల్లగా పుట్టేసరికి గేదెకు ఆవు దూడ పుట్టిందా అని అనుమానం వచ్చింది. -శాహేన్ రెడ్డి, రైతు, పార్డి కె
ఇదంతా బాగానే ఉన్నా.. ఆ గేదె దూడ తెల్లగా పుట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చూడటానికి అచ్చం లేగదూడలా ఉండటంతో గ్రామస్థులు చూడటానికి తరలివస్తున్నారు. ఆ దూడను చూస్తుంటే గేదెకు ఆవుదూడ పట్టిందా... అని అనిపిస్తోంది. జన్యులోపం(genetical disorder issues) కారణంగానే అరుదుగా గేదెలకు తెల్లదూడలు పుడతాయని పశువైద్యులు చెబుతున్నారు.