కడెం, స్వర్ణ జలాశయాల్లోకి వరద ఉద్ధృతి - కడెం జలాశయం
నాలుగురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ జలాశయాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న జలాశయాల్లోకి మరింత నీరు వచ్చిచేరుతోంది.
వరుసగా కురుస్తున్న వానలతో నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ జలాశయాలకు జలకళ సంతరించుకుంది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.8 అడుగుల నీటిమట్టాన్ని నిలకడగా ఉంచుతూ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి 9 గంటల వరకు 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 53,800 క్యూసెక్కుల నీటిని కిందకి వదిలారు. ప్రస్తుతం 4 గేట్ల ద్వారా 39వేల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. స్వర్ణ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 1,183కి నీరు చేరడం వల్ల రెండు గేట్లు ఎత్తి 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
- ఇదీ చూడండి : దేవదాస్ కనకాల పార్థివదేహానికి ప్రముఖుల నివాళి