నిర్మల్ జిల్లా కేంద్రంలోని కస్బా ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎసీఎస్ సహకార సంఘాల ఎన్నికలకు 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2,700 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు, వృద్ధులకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఓటు వేసేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్న వారు ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి వారి బంధువులు ఎత్తుకొని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.
చక్రాల కుర్చీలు లేవు.. మోసే వారుంటేనే ఓటెయ్యగలం.. - nirmal district today news
నిర్మల్ జిల్లాలో రైతు సహకార సంఘ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 17 సంఘాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా, 16 సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 122 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వికలాంగులకు, వృద్ధులకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఓటు వేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లను ఎత్తుకెళ్తున్నారు
జిల్లాలో మొత్తం 17 సంఘాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా, 16 సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 122 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :రాజకీయ హత్య: సహకార ఎన్నికల వేళ రక్తం చిందించిన యర్కారం