నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామస్థుడు రఘువీర్ భార్యకి 6 ఎకరాల భూమి తన తండ్రి ద్వారా సంక్రమించింది. బావమరిది ప్రతాప్ రావు అధికారులతో కుమ్మక్కై అక్క పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు మార్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న రఘువీర్ ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి పేషీలో ఫిర్యాదు చేసినప్పటకీ... సంబంధిత అధికారులు స్పందించలేదు. విసుగు చెందిన రఘువీర్ రావు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఖానాపూర్ తహశీల్దార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని జిల్లా పాలనాధికారి హామీ ఇవ్వడంతో రఘువీర్ నిరసన విరమించుకున్నాడు.
భూ సమస్య పరిష్కరించాలంటూ అర్ధనగ్న ప్రదర్శన - COLLECTORATE
తన భార్య పేరు మీద ఉన్న భూమిని అధికారులతో కుమ్మక్కై తన బావమరిది పేరు మీదకు మార్చుకున్నాడంటూ ఓ వ్యక్తి నిర్మల్ కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశాడు.
భూ సమస్య పరిష్కరించాలంటూ అర్థనగ్న ప్రదర్శన