గణపతి నవరాత్రి వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొవిడ్- 19 నిబంధనల మేరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, వినాయక చవితిని నిరాడంబరంగా జరుపుకోవాలని తెలిపారు. ఇళ్లల్లో మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలన్నారు.
వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలి : ఇంద్రకరణ్ రెడ్డి - నిర్మల్ జిల్లా వార్తలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గణపతి నవరాత్రి వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొవిడ్- 19 నిబంధనల మేరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, వినాయక చవితిని నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించారు. ఇళ్లల్లో మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలన్నారు. ఊరేగింపులు, నిమజ్జన వేడుకలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఊరేగింపులు, నిమజ్జన వేడుకలు ఉండవని మంత్రి పేర్కొన్నారు. విగ్రహ నిమజ్జనానికి అనుమతి లేదని, ఇళ్లలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని కోరారు. ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ కరోనా నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 469 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 314 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మహమ్మారితో ఆరుగురు మృతి చెందినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'