తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్న గ్రామాలు - స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్న గ్రామాలు

కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతుండటంతో నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్, బొప్పారం గ్రామాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. ప్రతి ఒక్కరూ అత్యవసరమైతేనే మాస్కు ధరించి బయటకు రావాలని నిబంధన విధించుకున్నాయి.

voluntarily lockdown in Villages
స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకున్న గ్రామాలు

By

Published : Apr 17, 2021, 2:24 PM IST

నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్, బొప్పారం గ్రామాల్లో కొవిడ్‌ పాజిటివ్ కేసులు ప్రజలను కలవరపెడుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరగడంతో భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావటంతో నివారణ చర్యలు తీసుకోవడానికి గ్రామస్థులు ముందుకొచ్చారు . ఇందులో భాగంగా ఇరు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.

గ్రామంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించి... మిగతా సమయంలో స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించనున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని సెలూన్లు, హోటళ్లు, దుకాణాలు, బీడీ కంపెనీలు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అత్యవసరమైతేనే మాస్కు ధరించి బయటకు రావాలని సూచించారు.

ఇదీ చదవండి:'కుంభమేళాలో భక్తుల సంఖ్య పరిమితంగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details