నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని బట్టిగల్లీకి చెందిన కొందరు స్థానికులు సంక్రాంతి పండుగ పూట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ముథోల్ సర్పంచ్ రాజేందర్‌ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందున కొందరు పండుగ పూట వారి ఇంటి ముందు వేసే ముగ్గుల్లో.. సంక్రాంతి శుభాకాంక్షలని రాసే బదులు రాజేందర్ సర్పంచ్ కావాలని రాశారు.
మా సర్పంచ్ మాకు కావాలంటూ సంక్రాంతి ముగ్గు - Nirmal District latest news
నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని బట్టిగల్లీకి చెందిన కొందరు స్థానికులు సంక్రాంతి పండుగ పూట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ముథోల్ సర్పంచ్ రాజేందర్‌ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో కొందరు పండుగ పూట వారి ఇంటి ముందు వేసే ముగ్గుల్లో.. రాజేందర్ తిరిగి సర్పంచ్ కావాలని రాశారు.

పండుగ పూట వినూత్న రీతిలో నిరసర
ఇంతకు ముందు ఉన్న సర్పంచ్‌లు ఏమీ పనులు చేయలేదని... రాజేందర్ సర్పంచ్ అయిన రెండేళ్లలో అన్ని పనులు చేశారని స్థానికురాలు లింగవ్వ అన్నారు. అతన్ని పదవి నుంచి ఎందుకు తొలగించారో తమకు కారణం తెలవాలని కోరారు. రాజేందర్‌ను సర్పంచ్‌గా మళ్ళీ పదవిలోకి తీసుకోవాలని కోరుతూ సంక్రాంతి పండుగ పూట వినూత్న రీతిలో నిరసన తెలిపామని అన్నారు.
ఇదీ చదవండి:తమిళనాట జల్లికట్టు జోరు- బసవన్నల హోరు