యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి త్వరగా అంతం కావాలని ప్రార్థిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిని పురస్కరించుకుని ఉదయం.. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయ పూజారులు ముత్యంపెల్లి రాజేశ్వర చారి, ముత్యంపెల్లి రత్నాకర్ చారి ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కరోనా నుంచి కాపాడాలని బ్రహ్మం గారి ఆలయంలో యజ్ఞం - telangana news
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ప్రార్థిస్తూ నిర్మల్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించారు.
వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పూజలు