వసంత పంచమిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్ధరాత్రి ఒంటిగంటకు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం మంగళ వాయిద్య సేవ, సుప్రభాతం, హారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక అక్షరాభ్యాసాలను ఆలయ పాలక వర్గాలు ప్రారంభించారు.
ఉదయం 11 గంటల నుంచి చండీ మహా విద్యా హోమం, ఆశీర్వచనం వంటి కార్యక్రమాలు చేయనున్నారు. సాధారణ, రూ.వెయ్యి టికెట్‌తో వేర్వేరు మండపాల్లో అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు.