తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు వద్దు'

నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. కాలనీకి చెందిన పలువురికి ఆరోగ్య సిబ్బంది టీకా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కోరారు.

By

Published : Apr 29, 2021, 2:07 PM IST

Teeka
Teeka


కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకా పంపిణీ చేస్తోందని నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని 33వ వార్డు భాగ్యనగర్ కాలనీలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.

కాలనీకి చెందిన పలువురికి ఆరోగ్య సిబ్బంది టీకా పంపిణీ చేశారు. వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు పట్టణంలోని అన్ని వార్డుల్లో టీకాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పూర్తిగా సురక్షితమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details