ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవమని... మన నినాదాలు మరఠ్వాడా వరకు వినిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన శుభాకాంక్షలు తెలిపారు. పటేల్ పరాక్రమం వల్లే హైదరాబాద్ రాష్ట్ర విమోచనం సాధ్యమైందని చెప్పారు. ఇవాళ విశ్వకర్మ జయంతి కూడా అని తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్న అమిత్ షా... మజ్లిస్‌కు భాజపా భయపడదని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టవా? అంటూ నిలదీశారు.