తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిరుద్యోగ యువత బంగారు భవితకే ఉద్యోగ మేళా' - latest news on Unemployed youth golden job fair

భైంసాలోని ఎస్​ఆర్​ఆర్​ ఫంక్షన్​ హాల్లో డివిజన్​ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్​ మేళా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శశిధర్​రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Unemployed youth golden job fair
'నిరుద్యోగ యువత బంగారు భవితకే ఉద్యోగ మేళా'

By

Published : Jan 11, 2020, 7:15 PM IST

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం భైంసా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్​మేళా నిర్వహించారు. నిర్మల్​ జిల్లా భైంసాలోని ఎస్​ఆర్​ఆర్​ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ జాబ్​ మేళాకు జిల్లా ఎస్పీ శశిధర్​రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేళాలో భైంసా, కుబీర్​, కుంటాల మండలాల నుంచి యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జాబ్ మేళాలో పాల్గొన్న యువకుల దరఖాస్తులను పరిశీలించి.. ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేస్తారని ఎస్పీ పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ కూడా ఇస్తారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా వారి బంగారు భవితకు బాటలు వేయాలనే ఉద్దేశంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

'నిరుద్యోగ యువత బంగారు భవితకే ఉద్యోగ మేళా'

ఇవీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన

ABOUT THE AUTHOR

...view details