నిర్మల్ జిల్లా కేంద్రంలో ఒలంపిక్ డే సందర్భంగా 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడా జ్యోతితో పట్టణంలోని జాతీయ రహదారిపై పరుగు తీశారు. ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి చూపాలని.. మన ఆరోగ్యం మన అదుపులోనే అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానాన్ని మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సారంగాపూర్ మండలం చించోలి వద్ద ఐదు ఎకరాల్లో కొత్త స్టేడియం నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
క్రీడాజ్యోతి పట్టుకొని మంత్రి పరుగులు
నిర్మల్లో ఒలంపిక్ డే పురస్కరించుకొని 2 కే రన్ నిర్వహించారు. క్రీడాజ్యోతి పట్టుకొని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరుగు తీశారు. ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి చూపాలని ఆయన సూచించారు.
అందరూ క్రీడలపై ఆసక్తి చూపాలి