నిర్మల్ మండలంలోని రాణాపూర్లో తుల్జా భవాని అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. రెండో వార్షికోత్సవం సందర్భంగా ఉదయం అమ్మవారికి రాథోడ్ మహేందర్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
రాణాపూర్లో ఘనంగా తుల్జా భవాని జాతర - nirmal district latest news
నిర్మల్ జిల్లా రాణాపూర్లో తుల్జా భవాని జాతర వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

రాణాపూర్లో ఘనంగా తుల్జా భవాని జాతర
జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి.. వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం... కొనసాగుతోన్న ఉద్రిక్తత