తెలంగాణ

telangana

ETV Bharat / state

డీటీఓకు కార్మికులకు మధ్య వాగ్వాదం - డీటీఓతో గొడవకి దిగిన ఆర్టీసీ కార్మికులు

నిర్మల్ జిల్లాకేంద్రంలోని బస్ డిపో వద్ద బస్సులు ఎందుకు తీస్తున్నారంటూ... ఆర్టీసీ కార్మికులు డీటీఓతో గొడవకి దిగారు.

డీటీఓకు కార్మికులకు మధ్య వాగ్వాదం

By

Published : Oct 19, 2019, 9:45 AM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద డీటీఓకు ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బస్సులు నడిపేందుకు డీటీఓ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను పిలిపించడం వల్ల ఆర్టీసీ కార్మికులు అధికారులతో గొడవకి దిగారు. 12 గంటల పాటు బస్సులను డిపో నుంచి బయటకి తీసేది లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ... డీటీఓ బలవంతంగా తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను పిలిపించి బస్సులు తీసే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. బంద్ ప్రశాంతంగా జరిగేందుకు కార్మికులు సహకరిస్తున్నట్లు, అధికారులూ సహకరించాలని కోరారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దు మణిగింది.

డీటీఓకు కార్మికులకు మధ్య వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details