నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉదయం ఆరుగంటలకే డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు డిపో ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని కార్మికులను అక్కడి నుంచి పంపించారు. బయటకు వచ్చిన ఆర్టీసీ కార్మికులు కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న ర్యాలీ 32వ రోజూ కొనసాగుతోంది. వేకువజాము నుంచే డిపో వద్దకు చేరుకున్న ఉద్యోగులు బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు.
డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు