నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన మానవ హారంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తలపెట్టిన సమ్మె నేటితో 7వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా బస్టాండు నుంచి నుంచి శివాజీ చౌక్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాజీ చౌక్‌లో మానవహారం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఆంధ్ర ప్రాంతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి లాభాల బాటలో నడుస్తుంటే... తెలంగాణలో కేసీఆర్ తమ బంధువులకు అప్పజెప్పాలని చూస్తున్నారని ఆరోపించారు.
నిర్మల్‌లో ఆర్టీసీ ఉద్యోగుల మానవహారం - నిర్మల్‌లో ఆర్టీసీ ఉద్యోగుల మానవహారం
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేటితో ఏడవ రోజుకి చేరుకుంది.
నిర్మల్‌లో ఆర్టీసీ ఉద్యోగుల మానవహారం