నిర్మల్ జిల్లా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ఐకాస పిలుపుమేరకు 52 రోజుల సమ్మెను విరమించారు. విధుల్లో చేరేందుకు అంగీకరిస్తూ వినతిపత్రాలు అందజేశారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని.. అందుకే కార్మికులను విధుల్లోకి అనుమతించబోమని డీఎం స్పష్టం చేశారు. కార్మికులెవరూ డిపోల్లోకి వెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారు. ఇంక చేసేదేమీ లేక కార్మికులంతా వెనుదిరిగారు.
విధుల్లోకి తీసుకోమంటే అనుమతి లేదన్న అధికారులు - ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరకుండా పోలీసుల అడ్డగింత
నిర్మల్ జిల్లా ఆర్టీసీ డిపో వద్ద విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ కాలేదంటూ డిపో మేనేజర్ వారిని అనుమతించలేదు.
విధుల్లోకి తీసుకోమంటే అనుమతి లేదన్న అధికారులు