తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడు మృతి - బస్సు, బైక్​ రోడ్డు ప్రమాదం

నిర్మల్​ పట్టణ శివారులో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TSRTC BUS, Bike Accident at Nirmal
ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీ

By

Published : Jun 25, 2020, 2:24 PM IST

నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి భైంసా పట్టణానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును దిలావర్​పూర్ నుంచి నిర్మల్​కు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నిర్మల్ ఆర్టీసీ డీఎం ఆంజనేయులు పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details