నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 30 స్థానాల్లో విజయం సాధించింది. 07 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందగా... భాజపా ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎంఐఎం 02 స్థానాల్లో గెలుపొందింది. నిర్మల్లో తెరాస ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.
బస్తీమే సవాల్: నిర్మల్ జిల్లాలో తెరాసదే పైచేయి - telangana municipal election polling 2020
నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో తెరాస జెండా ఎగురవేసింది. ఒక్క భైంసా మున్సిపాలిటీలో మాత్రం ఎంఐఎం విజయం సాధించింది.
బస్తీమే సవాల్: నిర్మల్లో తెరాసదే పైచేయి
భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. 26 వార్డులకు గానూ... ఎంఐఎం 15 స్థానాలు గెలుపొందగా... భాజపా 9, ఇతరులు 2 స్థానాలు కైవసం చేసుకున్నారు. భైంసాలో తెరాస ఖాతా తెరవకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది.
ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గానూ తెరాస 05 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 05, భాజపా 01, ఇతరులు 01 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది.