తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ నిర్మల్​లో సంబురాలు.. - తెరాస నాయకుల సంబురాలు

రాష్ట్రంలో తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ నిర్మల్​ జిల్లా కేంద్రంలో తెరాస నాయకులు సంబురాలు చేసుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిని అరికట్టేందుకు ఈ చట్టం ఎంతగానో తోడ్పడుతుందని.. రైతులకు మేలు జరుగుతుందని మున్సిపల్​ ఛైర్మన్​ గండ్రత్​ ఈశ్వర్​ అభిప్రాయపడ్డారు.​

TRS leaders held celebrations in Nirmal district to welcome the new revenue act
కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ నిర్మల్​లో సంబురాలు..

By

Published : Sep 9, 2020, 3:22 PM IST

రెవెన్యూ వ్యవస్థలో రాజ్యమేలుతున్న అవినీతిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో తెరాస నాయకులు సంబురాలు చేసుకున్నారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రెవెన్యూ చట్టం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏ పని చేసినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ సాజిద్, తెరాస పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, జిల్లా ఉపాధ్యక్షులు పాకాల రాంచందర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details