నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు, వారి సహాయకులు, యాచకులకు తెరాస నేత కూచాడి శ్రీహారి రావు సోమవారం అన్నదానం, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
Food distribution: నిరుపేదలకు భోజనం పంపిణీ చేస్తున్న తెరాస నేత - trs leader kuchadi srinvas rao latest news
కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిరుపేదలకు తెరాస నేత కూచాడి శ్రీహరి రావు భోజనం పంపిణీ చేశారు.
నిరుపేదలకు భోజనం పంపిణీ చేస్తున్న తెరాస నేత
నిరుపేద ప్రజలకు ఆహారం అందజేయడం అభినందనీయమని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వేణుగోపాల కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ సంతోష్ రాజ్, తెరాస నాయకులు పూదరి అరవింద్, గాజుల రవి కుమార్, భూరాజ్, గడ్డింటి ప్రశాంత్, సంజీత్ రెడ్డి, గణేష్, అజహర్, కోనేటి ఆనంద్, చైతన్య, కృష్ణ సాయి, చంద్ర శేఖర్, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ