రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు బలపరుస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భాజపా భూస్ధాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. సాగర్ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.
మున్ముందు భాజపా భూస్థాపితం కావడం ఖాయం: ఇంద్రకరణ్
గులాబీ శ్రేణుల్లో మరోసారి పండుగ వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్.. సమీప అభ్యర్థి జానారెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పార్టీలో సంబురాలు అంబరాన్నంటాయి. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు.
నిర్మల్లో తెరాస సంబురాలు
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయం, తాజాగా సాగర్ ఉప ఎన్నికలో గెలుపే కేసీఆర్కు ప్రజాదరణ పెరిగిందనడానికి ఉదాహరణ అని కొనియాడారు.
ఇదీ చదవండి:నాగార్జున సాగర్లో జోరు తగ్గని కారు