విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో ఉందని నిర్మల్ జిల్లా లైన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా అన్నారు. విద్యతోపాటు వివిధ సామాజిక రంగాల్లో సేవలందిస్తోన్న ఐదుగురు ఉపాధ్యాయులను నిర్మల్ జిల్లా లైన్స్క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించారు.
లైన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం - తెలంగాణ తాజా వార్తలు
ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని నిర్మల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యతో పాటు వివిధ సామాజిక రంగాల్లో సేవలు అందిస్తోన్న ఐదుగురుని సత్కరించారు.
లైన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
ఉపాధ్యాయులు శోభ, విజయలక్ష్మి, కుమ్మరి బోజన్న, మురళీధర్, అన్నం శ్రీదేవిని సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి చంద్రమోహన్ రెడ్డి, వెంకటేశ్వరరావు, గంగారెడ్డి, పి. గంగారెడ్డి, నేరెళ్ల హన్మంతు తదితరులు పాల్గొన్నారు.