భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ అరాచకాలను ఎదిరించి.. ప్రాణాలు అర్పించిన గొప్ప యోధుడు రాంజీగోండు అని తెలంగాణ ఆదివాసి సంఘం నాయకుడు నైతం భీంరావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెయ్యి ఉరుల మర్రి స్తూపం వద్ద ఆయన వర్ధంతిని నిర్వహించారు. అనంతరం చైన్ గేట్ సమీపంలో ఉన్న రాంజీగోండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రాంజీగోండుకు గిరిజన నేతల ఘన నివాళి - రాంజీగోండుకు నివాళులు అర్పించిన గిరిజన నేతలు
తెలంగాణ కొసం పోరాడిన మొదటి వీరుడు రాంజీగోండు అని తెలంగాణ ఆదివాసి సంఘం నాయకులు అన్నారు. ఆయన వర్థంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెయ్యి ఉరుల మర్రి వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాంజీగోండు వర్థంతి
తెలంగాణ కొరకు పోరాడిన మొదటి వీరుడు రాంజీగోండు అని ఆదివాసీ నాయకులు అన్నారు. ప్రతీ ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగాలని సూచించారు. ప్రతీ ఏటా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని, రాంజీగోండు వర్థంతిని ఆయన విగ్రహ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:'ఆయన పేరు వింటేనే వణుకు'