తెలంగాణ

telangana

'సమస్యలు పరిష్కరించాలి.. 19వేల గౌరవ వేతనం ఇవ్వాలి'

ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై సీఎం స్పందించాలని నిర్మల్ జిల్లాలో ట్రాస్మా నేతలు ర్యాలీ నిర్వహించారు. బడుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. నెలకు 19వేల గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

By

Published : Jan 11, 2021, 5:09 PM IST

Published : Jan 11, 2021, 5:09 PM IST

Trasma leaders rally to get CM to respond on issues
సమస్యలపై సీఎం స్పందించాలని ట్రాస్మా నేతల ర్యాలీ

ప్రైవేట్​​ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాస్మా నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు.

అనుమతివ్వాలి..

ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై సీఎం స్పందించాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో బడుల ప్రారంభోత్సవానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ ఇవ్వాలని కోరారు.

ప్రైవేట్​ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు రూ.19వేల గౌరవ వేతనం చెల్లించాలి. పాఠశాలలను బడ్జెట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలుగా గుర్తించాలి. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి.

- ఆడెపు సుధాకర్, ట్రాస్మా నాయకుడు

ఇదీ చూడండి:మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details