తెలంగాణ

telangana

ETV Bharat / state

revanth reddy: 'ఉండాలంటే పద్ధతి మార్చుకోండి.. లేదంటే వెళ్లిపోండి' - నిర్మల్​లో కాంగ్రెస్​ ర్యాలీ

కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను వదిలేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కోసం కష్టపడిన వారిని వదులుకునేది లేదని, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని అన్నారు. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

revanth reddy
revanth reddy

By

Published : Jul 12, 2021, 7:52 PM IST

కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలు ఉంటే పద్ధతి మార్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ నెలాఖరు వరకు అవకాశం ఇస్తున్నా... ఎవరైనా ఇంటిదొంగలు ఉంటే పారిపోండని.. లేదంటే పద్ధతి మార్చుకోవాలన్నారు. అధికారంలో ఉన్నామని తమ కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌ లక్కీ నంబర్‌ 6, తన లక్కీ నంబర్‌ 9. ఆరు నంబర్‌ను తిరగేస్తే 9 అవుతుంది. వచ్చే ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి మహేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలి అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమాలతో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​లో ఉన్నోళ్లు ఎవరైనా ఇంటిదొంగలుంటే వదిలిపెట్టేది లేదు... పార్టీకోసం కష్టపడేటోడుంటే వదులుకునేది లేదు. కాంగ్రెస్​ కోసం కష్టపడేవాళ్లను గుండెల్లో పెట్టుకుని, దక్కరకు చేర్చుకుని చూసుకునే బాధ్యత మాది. ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే నెలాఖరు వరకు సమయమిస్తున్నాం.. ఎవరైనా ఉంటే పారిపోండి. లేకపోతే మీ బుద్ధి మార్చుకోండి. కష్టపడేవాళ్లు పదిమంది ఉన్నా చాలు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్​ దోపిడీ చేసి కౌరవుల ప్రతినిధిగా తెరాస ఉంటే... రాష్ట్ర ఇచ్చిన వాళ్లుగా, రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగాలు చేసిన మనం పాండవులం. ధర్మం కాంగ్రెస్​ వైపు ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ పార్టీ గెలుస్తుంది. కచ్చితంగా హుజూరాబాద్​లో కాంగ్రెస్​ పార్టీ ప్రజల దగ్గరకు వెళ్తుంది. ఇద్దరి దొంగల బండారం బయట పెడుతుంది. రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.

ఉండాలంటే పద్ధతి మార్చుకోండి.. లేదంటే వెళ్లిపోండి

ఇదీ చూడండి:Kaushik Reddy: 'రేవంత్ అమ్ముడుపోయాడు.. 50 కోట్లు ఇచ్చి అధ్యక్షుడయ్యాడు'

ABOUT THE AUTHOR

...view details