నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.7 మీటర్లుండగా.. ప్రస్తుతం 358.60 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది.
నిండుకుండలా గడ్డెన్నవాగు ప్రాజెక్టు.. 3 గేట్లు ఎత్తిన అధికారులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీ వరద రావడం వల్ల అధికారులు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
నిండుకుండలా గడ్డెన్నవాగు ప్రాజెక్టు
ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 20వేల క్యూసెక్కుల నీరు చేరగా.. అధికారులు మూడు గేట్లు ఎత్తి 26,140 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆటోనగర్ వద్ద సుద్దవాగు వంతెనపై నుంచి ప్రవహిస్తున్నవరద నీటిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు.
భైంసా మండలంలోని పాల్సికర్ రంగారావు ప్రాజెక్టులోకి వరద నీరు చేరి మహాగామ్, పార్ది(బి) గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.