నిర్మల్ జిల్లా మామడ మండలం పులిమడుగులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 3.5 కిలోల ఎండబెట్టి ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఆత్రం మారుతి గాంజా పండిచి యువతకు అమ్ముతున్నాడన్న పక్క సమాచారంతో అతని ఇంటిపై మండల సీసీఎస్ పోలీసులు దాడి చేశారు.
3.5 కిలోల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్టు
గంజాయిని పండించి యువతకు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని ఇంటి నుంచి 3.5 కిలోల గాంజాను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయించిన, తాగిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
3.5 కిలోల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్టు
నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎవరైనా గంజాయిని విక్రయించిన, తాగిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి విషయంలో ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే వెంటనే పోలీసులకు చెప్పాల్సిందిగా.. వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని సీఐ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.