2020 - 21 విద్యా సంవత్సరానికి ఐటీఐలో ప్రవేశాల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించిందని నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బి.కృష్ణ మూర్తి తెలిపారు. కొవిడ్19 పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని వివరించారు.
ఐటీఐ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు - ఐటీఐ విద్యార్థులు
ఐటీఐ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐటీఐలో ప్రవేశాల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడగించింది.
ఐటీఐ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు
నిర్మల్ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్ వెల్డర్లలో అడ్మిషన్లు ఉన్నాయని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ దరఖాస్తులను www.iti.telangana.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.
ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్
Last Updated : Sep 8, 2020, 10:44 PM IST