నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 11వ వార్డులో గల బట్టిగల్లీలో రెండు కోతులు విద్యుత్ స్తంభాలపై దూకటంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగాయి. ఆ విద్యుత్ తీగలు ఇళ్లపై పడ్డాయి. అయితే ఆ సమయంలో ఆ దగ్గర్లో ఎవరు లేక పోవటంతో ప్రాణాపాయం తప్పింది. గల్లీ వాసులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
కోతులు దూకాయి.. స్తంభాలు విరిగాయి - తెలంగాణ వార్తలు
కోతులు దూకడంతో విద్యుత్ స్తంభాలు విరిగాయి. మీరు వింటున్నది నిజమే..! అదెలా..? అంటారా. మీకు వచ్చిన సందేహాలు తీరాలంటే.. ఇది చదవాల్సిందే..!
కోతులు దూకాయి.. స్తంభాలు విరిగాయి
కేవలం కోతులు దూకడం వల్లే విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయే పరిస్థితి ఉందని బట్టిగల్లీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న స్తంభాలతో నిత్యం భయపడాల్సి వస్తుందని.. చాలా వరకు ఇళ్లపై నుంచే విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని స్థానికులు ఆరోపించారు. విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని వారు వాపోయారు. వెంటనే తమ సమస్యలు తీర్చకుంటే ధర్నా చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:ఫోన్లు కొనిచ్చి... 'సెల్రాజు'గా మారిన సీఐ